సిద్దిపేట ఆక్రమిత భూముల్లో పేదలకు ఇండ్లు
- కేటీఆర్ కొడుకుకి 40 ఎకరాలు ఎక్కడిది?
- కేసీఆర్ రెండు ఎకరాల ఇల్లు అఫిడవిట్‌లో ఏది?
- తప్పు చేస్తే ఎవరినీ వదలం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర సర్వే నిరహించి భూముల అసలు లెక్క తేలుస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. రికార్డులు, డాక్యుమెంట్లు, క్షేత్రస్థాయిలో భౌతిక పరిస్థితులను సమన్వయం చేసి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల(government and private lands) వివరాలను నిర్ధారిస్తామని పేర్కొన్నారు. స ర్వేలో వెలుగుచూసిన వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశా రు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి చిట్‌చాట్ నిర్వహించారు.
భూముల విషయంలో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకొని అక్కడ పేదల కో సం ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్(KCR farmhouse) పరిసరాల్లోని భూ ముల విషయంలో స్థానికుల నుం చి వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం ఆరా తీస్తుందని మంత్రి తెలిపారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల్లో ప్రభు త్వ భూమి ఉన్నట్లు సర్వేలో తేలితే, చట్టప్రకారం ఆ భూమిని ఆధీనంలోకి తీసుకుని అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితుల కు ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
2004 అఫిడవిట్‌లో భూములు లేవని చెప్పి.. ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ భూములపై జరుగుతున్న చర్చలో ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన వివరాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ‘2004 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తన పేరున వ్యవసాయ భూమి లేదని పేర్కొన్నారు.
తర్వాత కాలం లో పెద్ద ఎత్తున భూములు ఎలా వచ్చాయి? పుట్టుకతోనే వందల ఎకరాల భూస్వాములమని చెబుతున్నప్పుడు, ఆ భూముల వివరా లను ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదు?, రెండు ఎకరాల స్థలంలో ఇల్లు ఉం దని చెప్పి ఆ విషయం కూడా ఎందుకు బయటపెట్టలేదు?’ అని ప్రశ్నించారు. ‘కేటీఆర్ కొడుకుకు 40 ఎకరాల భూమి ఎలా వచ్చింది. నూనూగు మీసాల పిల్లోడు ఏ వ్యాపారం చేశాడని ఇంత భూమి వచ్చింది?’ అని మంత్రి ప్రశ్నించారు.
హరీశ్ అఫిడవిట్‌నూ పరిశీలిస్తాం
హరీశ్‌రావు ఎన్నికల అఫిడవిట్‌లో చూపి న భూముల వివరాలు, ప్రస్తుతం ఆయనకున్న భూములు, ట్రస్టుల పేరిట ఉన్న స్థలా లను సైతం పరిశీలిస్తామని మంత్రి తెలిపా రు. అఫిడవిట్‌లో చూపిన విస్తీర్ణంలో కంటే ఒక గుంట తేడా ఉన్నా రికార్డుల ద్వారా తేలుస్తామని పేర్కొన్నారు. హరీశ్‌రావు కు టుంబ సభ్యులు మాజీ సైనికుడి నుంచి భూములు కొనుగోలు చేశారన్న వాదనపై మంత్రి స్పందించారు. భూముల రిజిస్ట్రేషన్, పట్టా, డాక్యుమెంట్లను పరిశీలిస్తామని చెప్పా రు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేర్లతో జరిగిన భూ లావాదేవీలకు సం బంధించిన పత్రాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
అసైన్డ్ భూముల విష యం లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు. రంగనాయకసాగర్ పరిసర భూముల విషయంలో అప్పటి ఇరిగేషన్ శాఖ రికార్డులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జో న్, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. శాఖ ల మధ్య లేఖలు, భూముల వర్గీకరణలో మార్పులు, రిజిస్ట్రేషన్ జరిగిన విధానం, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వినియోగించారా, లేదా? తదితర వివరాలు సేకరిస్తామని చెప్పారు.
వట్టినాగులపల్లి భూమి నాది కాదు..
వట్టినాగులపల్లి భూమితో తనకు ప్రత్యక్షంగా యాజమాన్య సంబంధం లేదని మం త్రి స్పష్టం చేశారు. ఆ భూమి తనది కాదని, డెవలప్‌మెంట్ కోసం తీసుకున్నామని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకముందే వ్యాపార రంగంలో ఉన్నానని పేర్కొన్నారు. తన ప్రాజెక్టులకు అనుమతులు గత ప్రభుత్వాల సమయంలోనే వచాయని, అదే ప్రభు త్వాలు వాటిని నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. తాను మంత్రి అయిన తర్వాత తన కుమారుడు వ్యాపారంలోకి రాలేదని, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం తగదన్నారు. అసలు భూ రికార్డులు, డాక్యు మెంట్లపైనే చర్చ జరగాలన్నారు.