నాలాలు, రోడ్ల ఆక్రమణలకు చెక్

01-10-2026 | 02:38pm
  1. వ్యాపార సామగ్రిని రోడ్లపై, మురుగు కాలువలపై ఏర్పాటు చేయొద్దు
  2. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
  3. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. కిషన్

హుజురాబాద్,అక్టోబర్1: (విజయక్రాంతి):కరీంనగర్ జిల్లాహుజురాబాద్ పట్టణంలో నాలాలు, మురుగు కాలువలు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు తీసుకుంటామని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ జి కిషన్(Municipal Commissioner G. Kishan) అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యాపారులు రోడ్లపై, నాలాలు, మురుగు కాలువలపై వ్యాపార సామగ్రిని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు.

పట్టణ ప్రజలు నాలాలు, మురుగు కాలువలు, రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆయన సూచించారు. వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన సామగ్రిని రోడ్లపై, నాలాలు, మురుగు కాలువలపై ఏర్పాటు చేయకుండా సహకరించాలని కోరారు.

పట్టణ సుందరీకరణ, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆక్రమణలు చేపట్టవద్దని కమిషనర్ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పురపాలక పరిపాలనా చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు