20 March, 2026 | 6:29 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అవన్నీ చూసొచ్చి మరీ..

10-07-2024 12:05 AM

నటనపై ఆసక్తి ఉండటంతో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది కేరళ కుట్టి ప్రిశా రాజేశ్ సింగ్. మోడలింగ్ రంగంలో సాధించిన అనుభవం, పేరు ప్రతిష్టలే తన కలల రంగమైన సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చాయి ఆమెను. నిఖిల్ ‘స్పై’తో తెలుగు ప్రేక్షకుల ముంగిట్లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. ‘స్పై’లో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ అమ్మడికి ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ‘స్పై’ చిత్రీకరణలో ఉండగానే ప్రిశాను మరో సినిమా అవకాశం పలుకరించింది. అదే అల్లు శిరీష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘బడ్డీ’ సినిమా. అంటే, ‘బడ్డీ’తో మరోమారు తెలుగు తెరపై మెరవనుందన్న మాట ఈ భల్లే భల్లే బ్యూటీ.

సిక్కు పరివారంలో పుట్టి పెరిగిన ఈ పడుచు అందం మాతృభాష కన్నడలోనే కాక పంజాబీ, ఇంగ్లిష్ భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగలదు. తమిళ చిత్రం ‘టెడ్డీ’కి రీమేక్‌గా రూపొందుతున్న ‘బడ్డీ’లో నటిస్తున్నప్పుడే తెలుగు కూడా నేర్చుకుందీ సొగసరి. ‘బడ్డీ’లో ప్రిశా.. ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనుంది. ఆ పాత్ర కోసం ఎయిర్ హోస్టెస్‌ల నడవడిక, పనితీరు, బాడీ లాంగ్వేజ్‌ని దగ్గరుండి మరీ చూసి హోమ్‌వర్క్ చేసింది ప్రిశా. ప్రకృతిలో గడిపేందుకు ఇష్టపడే ప్రిశా తరచూ బీచ్‌లకు వెళ్తుంది. అడవుల్లో విహరించడమూ మహా సరదా ఈమెకు. ఫొటోషూట్లలో పాల్గొంటూ గ్లామరస్ ఫోజులను అప్‌లోడ్ చేస్తూ ఇన్‌స్టాలో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.