పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు.. నిందితుడి అరెస్ట్

16-09-2026 | 10:52pm

*60 గంజాయి మొక్కల స్వాధీనం..

*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం..

*అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు....

*ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే 

ఉట్నూర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు(Illegal Cannabis Cultivation) చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం  కొడప మారుతి  వ్యవసాయ చేనులో పత్తి పంటలో  గంజాయి సాగు చేస్తున్న సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.

కోడప మారుతి, (34 )  పరస్వాడ-బి, గాదిగూడ మండలానికి చెందిన  మారుతిని అరెస్టు చేసినట్లు  ఏఎస్పి  రిత్విక్ సాయి కుట్టే తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని  అన్నారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు