పట్టుబిగించిన భారత్ ఏ

25-09-2026 | 05:00am

పుదుచ్చేరి, సెప్టెంబర్ 24: ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు(1st Unofficial Test)లో భారత్-ఎ జట్టు పట్టు బిగించింది. భారత్-ఎ తమ రెండో ఇ న్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌట్ అ యింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 39 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యా టర్, కెప్టెన్ దేవదత్ పడిక్కల్ అర్ధ శతకంతో (88 బంతుల్లో 59) రాణించాడు.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థి ముందు అద్భుతమైన లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 334 పరుగులు చేసింది.363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు భారత బౌలర్లు షాకిచ్చారు. స్పిన్నర్ తనుష్ కొటియన్, పేసర్ తుషార్ దేశ్పాండేలు ఆసీస్ ఓపెనర్లు సామ్ కాన్‌స్ట్టాస్ (20), క్యాంప్‌బెల్ కెల్లవే (0)లను పెవిలియన్‌కు పంపారు. దీంతోమూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు