సెమీస్‌లో భారత హాకీ జట్లు

27-09-2026 | 05:30am

నగోయా, సెప్టెంబర్ 26 : ఆసియా క్రీడ ల హాకీలో(Asian Games Hockey) భారత జట్లు దుమ్ము రేపుతున్నాయి. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆతిథ్య జపాన్‌పై విజయం సాధిం చాయి. పురుషుల హాకీ జట్టు 2- తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ మొదటి గోల్ చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చే శారు.

ఈ విజయంతో భారత పురుషుల జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసి సెమీఫైనల్ బెర్తను ఖరారు చేసుకుంది. అటు మహిళల జట్టు పూల్-బి మ్యాచ్‌లో జ ప్పా 3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి క్వార్టర్లో లాల్రెమ్సియామి ఓపెన్ ప్లే ద్వారా తొలి గోల్ కొట్టగా, రెండో క్వార్టర్ చివర్లో ఇషికా మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని పెంచుకొచ్చింది. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి భారత్ స్కోర్ 2 జప్పా ఆధిక్యం లో నిలిచింది. 

మరిన్ని వార్తలు