బీఆర్ఎస్ వినూత్న నిరసన.. శిలాఫలకానికి పిండ ప్రధానం
10-09-2026 | 01:59pm
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : భూపాలపల్లి మండలం(Bhupalpally Mandal) ఎస్ ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్(BRS leaders) నాయకులు శిలాఫలకానికి పిండ ప్రధానం చేసి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజు రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారని తెలిపారు. సంవత్సరం గడిచినా పనులు మాత్రం మొదలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు బాగాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శిలాఫలకానికి పిండ ప్రధానం చేసి నిరసన తెలియజేశారు.