ఆరు నెలల ముందే స్కెచ్

23-09-2026 | 06:52am

మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. విచారణ ముమ్మరం!

మద్రాస్ రెజిమెంట్‌లో చోరీ.. సంచలన విషయాలు!

ఆర్మీలోకి నేర చరిత్ర ఉన్న మల్లేష్ ఎలా వచ్చాడు? 

హైదరాబాద్: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో(Madras Regiment arms theft case) దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజు కస్టడీలో నిందితుడు మల్లేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. మల్లేష్ ఆరు నెలల ముందు ఆయుధాగారంలో చోరీకి ప్లాన్ చేశాడు. ఆర్మీ ఉన్నతాధికారితో విభేదాలే చోరీకి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్రమశిక్షణ చర్యలతో మల్లేశ్ లో ప్రతీకారం పెరిగిపోయింది.

2005లో అచ్చంపేటలో, 2007లో అమ్రాబాద్ లోనూ మల్లేష్ పై బంగారం, వెండి ఆభరణాల చోరీ కేసులు నమోదయ్యాయి. నేర చరిత్ర ఉన్న మల్లేష్ ఆర్మీలో(Army) ఎలా ఎంపికయ్యాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆగస్టు 28,29న రెజిమెంట్ లో రెక్కీ నిర్వహించిన మల్లేష్ 30 ఆయుధాగారంలో చోరీకి పాల్పడ్డాడు. 12 ఆయుధాలు, 1,920 తుటాలు, నైట్ విజన్ బైనాక్యులర్ చోరీ చేశాడు. ప్రస్తుతం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఫోన్ కాల్స్ పై పోలీసులు దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు