రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థులు

16-09-2026 | 02:31pm

జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ పోటీల్లో మూడు పతకాలు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఇటీవల సుల్తానాబాద్‌‎లోని ఎస్‌ఎన్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ముగ్గురు విద్యార్థులు పతకాలు సాధించి 17న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీలకు అర్హత సాధించారు.15సంవత్సరాల బాలుర విభాగంలో ఎన్‌.సహర్ష్‌ బంగారు పతకం సాధించాడు. 

13సంవత్సరాల బాలుర విభాగంలో పి. కౌశిక్‌, శ్రీతన్‌ , దీక్షన్‎లు కాంస్య పతకాలు సాధించారు.వీరి ప్రతిభకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల విజయంపై పాఠశాల చైర్మన్‌ మాటేటి సంజీవ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేసిన టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ సత్యనారాయణను అభినందించారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పాఠశాల తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సునీత, మేనేజర్‌ శివ, పీఈటీలు సతీష్‌, జ్యోతి పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు