తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం: కవిత
15-09-2026 | 04:25pm
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): తెలంగాణ విద్యా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలు కొనసాగుతున్నాయని అన్నారు. కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు