7 September, 2026 | 6:07 AM

అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు

07-09-2026 | 05:05am

ప్రతిస్పందన ఇలాగే ఉంటుందని ఐఆర్జీసీ వార్నింగ్

నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుంటే మరిన్ని దాడులు చేస్తాం: అమెరికా

టెహ్రాన్, సెప్టెంబర్ 6: ఇరాన్(Iran) నౌకలపై దాడుల వీడియోను విడుదల చేసిన అమెరికాను వణికించామని ఐఆర్జీసీ(IRGC) ఆదివారం ప్రకటించింది. హోర్ముజ్‌లోని అగ్రరాజ్యానికి చెందిన విమాన వాహక నౌక డెస్ట్రాయ్‌పై బాలిస్టిక్ క్షిపణుల(Ballistic Missiles)తో దాడులు చేశామని పేర్కొంది. దాడుల్లో అమెరికా నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని దీంతో నౌకలు వెనక్కు వెళ్లిపోయాయని ప్రకటించింది. ఇరాన్ నౌకల విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తే తమ నుంచి ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని టెహ్రాన్ హెచ్చరించింది. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించింది.

గతంలో కంటే మరింత బలంగా దాడులను కొనసాగిస్తామని ఐఆర్జీసీ అమెరికాకు హెచ్చరికలు జారీచేసింది. కాగా ఈ దాడులపై అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ దాడుల నుంచి తమ నౌకలు సురక్షితంగా తప్పించుకున్నాయని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లిలేదని తెలిపింది. తమ నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ నౌకలపై మరిన్ని దాడులు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఏది ఏమైనా యుద్ధమేఘాలు చల్లారుతాయి అనుకుంటుండగా, ఇరుదేశాల దాడులతో మరోమారు హోర్ముజ్ నుంచి రాకపోకలు సాగిస్తున్న వివిధ దేశాల నౌకలపై ఈ ప్రభావం పడుతుంది.


మరిన్ని వార్తలు