7 September, 2026 | 7:27 AM

‘సమీకృతం’ శిథిలం?

07-09-2026 | 05:30am
  1. నిధులు వచ్చినా ప్రారంభం కాని పనులు 
  2. తప్పని చిరు వ్యాపారుల కష్టాలు 
  3. సమీకృత నిర్మాణ పనుల్లో జాప్యం 

మెట్‌పల్లి, సెప్టెంబర్6(విజాయక్రాంతి):పట్టణ శివారు వెల్లుల రోడ్డు లో కూరగాయలు, మాంసం ఓకే చోట విక్రయించేలా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS government) ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. అప్పటి ఐటీ, మున్సి పల్ శాఖ మంత్రి కేటీఆర్ (IT and Municipal Minister KTR) మెట్ పల్లి పట్టణం లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ. 6.5 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది.

సమీకృత నిర్మాణ స్థలం విషయంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఖాది బోర్డు చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గత మున్సిపల్ పాలకవర్గం చొరవ తో 2021 జూన్ లో మెట్ పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్ లో ఖాదీ ప్రతిష్టాన్ కు చెందిన స్థలాన్ని మార్కెట్ నిర్మాణానికై తొంబై తొమ్మిది సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్ ద్వారా సేకరించడం జరిగింది. కాగా అప్పటి మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి శంకుస్థావన చేశారు.

ఆ నిధులతో కొంతవరకు మార్కెట్ పనులను కాంట్రాక్టర్ పూర్తి చేస్తున్న సమయంలో రాష్టంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టడం జరిగింది. దింతో రెండో విడత రావాల్సిన నిధులు నిలిచి పొవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోయాయి. ఇప్పటికే పూర్తయి సమీకృత మార్కెట్ వినియోగంలోకి రావాలి కానీ. అసంపూర్తిగా నిర్మాణమైన సమీకృత మార్కెట్ బిచ్చగాళ్లకు, అసాంఘిక శక్తులకు, పోకిరిలకు, తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం లో ఉన్న సమీకృత మార్కెట్ లో మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి బహిరంగ మలమూత్ర విసర్జన కేంద్రాలుగా మారిపోయింది. మార్కెట్ నిర్మాణ పనుల కోసం ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని నిధులు విధుల అయినట్లు తెలిసింది. దింతో చిరు వ్యాపారుల కష్టాలు తిరే అవకాశం ఉంది.

సంత రోజు తప్పని చింత 

పట్టణంలో ప్రతి మంగళవారం వారసంత వెల్లుల్ల రోడ్డులో నిర్వహిస్తున్నారు. ఇదే రోడ్డు మార్గం వెల్లుల్ల గ్రామం లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఎల్లమ్మ దేవాలయం కు ప్రతి మంగళవారం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రతి మంగళవారం వారసంత అలాగే ఎల్లమ్మ దేవాలయం వెళ్లే భక్తుల వాహనాలతో రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు వాహనదారులు ప్రమాదల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు.

ఇప్పటికైనా సంబందిత అధికారులు సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తే వెల్లుల్ల రోడ్డు ఇరువైపులా కూరగాయలు అమ్మే దుకాణదారులు సమీకృత మార్కెట్లోకి తరలించవచ్చు.దింతో వాహనాల రద్దీ తగ్గి ప్రయాణికుల కష్టాలు తిరే అవకాశం ఉంది.

నిధులు విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత అధికారుల ఆదేశాలు రాగానే పనులు ప్రారంభం చేస్తాం.

మున్సిపల్ కమిషనర్ దుర్గపు శ్రీనివాస్ గౌడ్. మెట్‌పల్లి 

మరిన్ని వార్తలు