రజతంతో మెరిసిన ఇషా
* ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్(Telangana shooter Esha Singh) మెరిసింది. టీం ఈవెంట్‌లో నిరాశ పరిచినా, వ్యక్తిగత విభాగంలో తన సత్తా చాటింది. 25మీ. పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అద్బుత పోరాటంతో రజతాన్ని అందుకుంది. ఇషాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
- 25మీ. పిస్టల్ ఈవెంట్‌లో మెడల్
- రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
- నిరాశ పరిచిన మను బాకర్
నగోయా, సెప్టెంబర్ 28 : భారత షూటింగ్(Indian Shooting) యువ సంచలనం ఇషా సింగ్(Esha Singh) మరోసారి అంతర్జాతీయ వేదికపై అదర గొట్టింది. జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games) మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజతం(Silver medal) సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 580 పాయింట్లతో ఈషా సింగ్ అతి కష్టం మీద చివరిదైన 8వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ మ్యాచ్ మొదట్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఇషా, ఒకానొక దశలో 4వ స్థానానికి పడిపోయి పతకం రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది.
అయితే, అత్యంత ఒత్తిడిలో 5/5 పర్ఫెక్ట్ సిరీస్ స్కోర్ చేసి తిరిగి పుంజుకుంది. పతకం కోసం జరిగిన ఈ పోరాటంలో ఇషా సింగ్ మొత్తం 5 షూట్-ఆఫ్‌లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 45 షాట్ల తర్వాత ఉత్తర కొరియా షూటర్ కిమ్ హ్యోన్ సుక్తో కలిసి ఇషా 34 పాయింట్లతో సమానంగా నిలిచింది. రజతం, కాంస్య పతకాల విజేతను తేల్చడానికి జరిగిన మొదటి రెండు షూట్-ఆఫ్లు కూ డా 3-3తో టై అయ్యాయి. చివరకు మూడో షూట్-ఆఫ్లో ఇషా 3-2తో కిమ్‌పై విజయం సాధించి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఆ తర్వాత చైనా షూటర్ జియో జియారుగ్జాన్‌తో జరిగిన ఫైనల్ సిరీస్ ముగిసేసరికి ఇద్దరి స్కోర్లు 38- సమం అయ్యాయి. దీంతో బంగారు పతకం కో సం మళ్లీ షూట్-ఆఫ్ నిర్వహించారు. మొదటి టై- బ్రేకర్ 4--4 తో డ్రా కాగా, రెండో షూట్-ఆఫ్‌లో చైనా క్రీడాకారిణి 3-2 తేడా తో గెలవడంతో ఇషా సింగ్ తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుని రజత పతకంతో రన్నరప్‌గా నిలిచింది. ఆమె కెరీర్‌లో ఏషియన్ గేమ్స్ వ్యక్తిగత 25మీ పిస్తోల్ విభాగంలో వరుసగా ఇది రెండవ రజత పతకం. 2023 హ్యాంగ్‌జా గేమ్స్‌లో కూడా సిల్వ ర్ గెలిచింది.
ఇదిలా ఉంటే ఇషా సింగ్‌పై పలువురు ప్రముఖు లు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధా ని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆద ర్శమనీ రేవంత్ రెడ్డి కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశ ప్రతిష్ఠ, తెలంగాణ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలన్నారు.