అర్హులైన వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి

02-10-2026 | 01:37pm

ఉద్యోగులతో సమానంగా షరతులు లేని హెల్త్ కార్డులు జారీ చేయాలి

జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

టీయూడబ్ల్యూ(టీజేఎఫ్) 143 ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా విన్నపం

టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు.. కల్లోజి శ్రీనివాస్

కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ(Journalists ) ఎలాంటి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులుHealth Cards) మంజూరు చేయాలని ఉద్యోగులకు సమానంగా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు మంజూరు చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కేంద్రంలో టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా  పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీయుడబ్ల్యూ టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.

జర్నలిస్టుల సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఒకవైపు చెబుతూనే సమస్యలు తీర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ బాపూజీ కలలుగన్న నవ సమాజం రూపొందించి జర్నలిస్టు పక్షాన ఇకనైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి జర్నలిస్టులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం ఎంతో శుభ పరిమాణం అని అన్నారు.

ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు మెరుగైన వైద్య సేవలు తదితరువందించి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే( టీజేఎఫ్) వర్కింగ్ జర్నలిస్టులు పెంచు జిల్లా అధ్యక్షులు మట్టికొండ రవి, సహాయ కార్యదర్శి కాగితపు వెంకటేశ్వరరావు, సాక్షి బ్యూరో కృష్ణ గోవింద్, మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు చావా పాపారావు , కృష్ణారావు రమేష్ ,రమణ ,తారక్ , అశోక్, ప్రవీణ్, ఈశ్వర్ షబ్బీర్ ,శ్రీనివాస్, రాందాస్, జక్కంపూడి నరేష్ సత్య ,శనగ లక్ష్మణ్, రహీం, స్వామి గుంటుపల్లి  నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు