అదరగొట్టిన భారత్
ఏషియన్ గేమ్స్‌లో మరోసారి అదరగొట్టిన భారత్
ఫైనల్‌కు కమల్జీత్-సురుచి జోడీ!
నగోయా, సెప్టెంబర్ 25: ఆసియా క్రీడల్లో(Asian Games 2026 India) భారత షూటింగ్ జోడీ సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్(India Shooting Qualification) మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ అద్భుత ప్రదర్శనతో క్వాలిఫికేషన్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. వ్యక్తిగత విభాగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందిన భారత షూటర్లు.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం దూకుడు చూపించారు.
తొలి సిరీస్‌లో 196 పాయింట్లు సాధించిన భారత జోడీ.. రెండో సిరీస్‌లో 195 పాయింట్లు నమోదు చేసింది. దీంతో రెండు సిరీస్‌ల అనంతరం స్కోరు 391కి చేరింది. మూడో సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ మరో 196 పాయింట్లు సాధించారు. దీంతో మొత్తం స్కోరు 587 పాయింట్లకు చేరింది. ఇందులో 29 ఇన్నర్-10లు ఉండటం వారి అద్భుతమైన షూటింగ్‌కు నిదర్శనం. క్వాలిఫికేషన్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో కమల్జీత్-సురుచి(Kamaljeet Suruchi Singh) సింగ్ జోడీ టాప్‌లో నిలిచి పతక పోరుకు దూసుకెళ్లింది.