కవ్వంపల్లి వర్సెస్ రసమయి
కరీంనగర్, సెప్టెంబర్6(విజయక్రాంతి): మానకొండూరు నియోజకవర్గంలో (Manakondur Constituency) పొలిటికల్ ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి జిల్లా లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు వెయ్యిరోజుల పాలన విజయాలు, వైఫల్యాలపై పోటీపడి కార్యక్రమాలు నిర్వహిస్తే మనకొండూర్ లో మాత్రం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల మా టల యుద్ధం మరో మారు తారాస్థాయికి చే రుకుంది.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయ ణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వార్ నడుస్తోంది. ఏడాది క్రితం కామలీలల కవ్వంపల్లి అంటూ బీఆర్‌ఎస్ పోస్టర్ రిలీజ్ చేయగా.. రాసలీలల రసమయి అం టూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్ రిలీజ్ చేసింది. అ ప్పట్లో ఈ రెండు పార్టీ నేతల పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి వారి వారి అనుచరుల ధర్నాల వరకు వెళ్లాయి. తాజా మాటల యుద్ధం మరో మారు పొలిటికల్ హీట్ ను పెంచింది.
బోడి టీచర్...శనివారం జరిగిన టీచర్స్ డే రోజు మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మా జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యా య వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తిమ్మాపూర్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంకు హాజరైన కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిష్ప తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘చి న్న ఉద్యోగం.. బోడి టీచర్ ఉద్యోగం చేసిన నీకు ఇన్ని ఆసులు ఎకుడి నుంచి వచ్నాయి ఫామ్ హౌస్ , కోళ్ల ఫారాలు ఎలా కట్టావు అంటూ మాట్లాడ్డారు.
కవ్వంపల్లిపై రసమయి ఫైర్
‘టీచర్లు చదువు చెప్పందే నువ్వు డాక్టర్ అయ్యావా? నీకు అధికారంతో అహంకారం పెరిగింది. వెంటనే టీచర్లకు బేషరతుగా క్ష మాపణ చెప్పాలి.. లేదంటే తీవ్ర పరిణామా లు చవిచూడాల్సి ఉంటుంది’. అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా.రసమయి బా లకిషన్ హెచ్చరించారు.
గురువులను ఒక బోడి టీచర్ అని మాట్లాడిన అజ్ఞాని, ఒక మూర్ఖుడు, అవివేకుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి అని దుయ్యబట్టారు. ’సంస్కారహీనుడు క వ్వంపల్లి, అందుకే అతని రీతిలోనే మాట్లాడుతున్నా. నై తెలంగాణ అన్న చంద్రబాబు చె ప్పులు మోసిన కుక్కవి నువ్వు. గోసి గొంగడితోనే తెలంగాణ సాధించినం. దాని విలువ నీకేం తెలుసు అంటూ ఫైర్ అయ్యారు.






