మెట్ పల్లి లో కవిత పరామర్శ
16-09-2026 | 10:38pm
మెట్ పల్లి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు మాతృమూర్తి పుష్పలత ఇటీవల మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పరామర్శించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి లోని వారి నివాసానికి వెళ్లి పుష్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించి డాక్టర్ రఘు ను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.