కోస్గిలో జనజాతర..హామీ వర్కౌట్ అవుతుందా.?

20-09-2026 | 05:17pm

వికారాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి(Kosgi)లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించింది. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం స్థాయి సభను తలపించేలా జనసందోహం కనిపించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

సభలో కవిత చేసిన ప్రసంగం, ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా యువతకు సంబంధించిన హామీలు, విద్య, వైద్యం వంటి అంశాలపై ఆమె చేసిన ప్రకటనలు సభలో ప్రత్యేకంగా నిలిచాయి.

అయితే ఈ సభ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందనేది కొందరు అంచనా వేస్తున్నారు. యువతతో పాటు వివిధ వర్గాల స్పందన, ఇతర రాజకీయ పార్టీల ప్రచారం, ఎన్నికల సమయంలోని పరిస్థితులు వంటి అనేక అంశాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయి.లేదా అనేది వేచిచూడాలి.



మరిన్ని వార్తలు