7 September, 2026 | 6:08 AM

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి

07-09-2026 | 04:30am

అంబేద్కర్‌కు వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): అసెంబ్లీ సమావేశాలు ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ (Former Chief Minister KCR) అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాలను స్వీకరించాలంటూ కూకట్పల్లి వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేక బి ఆర్ యస్ నాయకులు ఇష్టారాజ్యాంగా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు సవాల్ విసిరిన స్పందించక పోవటమేంటని ప్రశ్నించారు.

ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని, అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఫామ్ హౌజ్ కే పరిమితం కావాలని బండి రమేష్ సూచించారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చిస్తారా, లేక ఫామ్ హౌస్ లో మొద్దు నిద్ర కొనసాగిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు