ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా కొండగడుపుల ప్రవీణ్ కుమార్

10-09-2026 | 08:36pm

నియామకానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యే,ఎంపీలకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రవీణ్ కుమార్

తుంగతుర్తి, (విజయ క్రాంతి): ఎన్ఎస్యుఐ(NSUI) జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల ప్రవీణ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతమ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్,రాష్ట్ర అధ్యక్షులు యాడవెల్లి వెంకటస్వామి తదితరులకు ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. యువ నాయకుడు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడిగా నియామకం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

.

మరిన్ని వార్తలు