కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా? రేవంత్‌కు KTR సవాల్
కేసీఆర్ ఆస్తులపై బురద జల్లి.. రేవంత్ సెల్ఫ్ గోల్ వేస్కుండు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వివరాలను వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని సీఎం విషప్రచారం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కు 67 ఎకరాలు మాత్రమే ఉందని సీఎం ఒప్పుకున్నారని సూచించారు. ఇన్నిరోజులు విష ప్రచారం చేసినందుకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని KTR డిమాండ్ చేశారు.
Also Read - కేసీఆర్ ‘భూబకాసురుడు’
కేసీఆర్ కు వ్యవసాయం అంటే మక్కువ.. సీఎంగా ఉన్నా వ్యవసాయం చేశారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ భూమిని ఆటవస్తువుగా చూడలేదన్నారు. చట్టప్రకారం కేసీఆర్ కొన్న భూములపై రేవంత్ రెడ్డి బురద జల్లుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్(KCR) ఆస్తులపై బురదజల్లి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాలు ఉండేవన్న కేటీఆర్ అప్పట్లోనే కేసీఆర్ ఇల్లు రెండెకరాల్లో ఉండేదని సూచించారు. చింతమడకలోని రెండెకరాలు ఇంటిని కూడా ప్రభుత్వ స్కూల్ కు ఇచ్చారని తెలిపారు.
తన నానమ్మ ఊరు కోనాపూర్(Konapur)లోని వందల ఎకరాల భూమి మానేరు డ్యామ్‌లో(Manair Dam) పోయిందన్న కేటీఆర్(KTR) కొండారెడ్డిపల్లి వెళ్తే సీఎం రేవంత్ బండారం బయటపడుతుందన్నారు. గోడలపై రాతలు రాసుకునే మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?, 57 ఏళ్ల నుంచి మీ కుటుంబం ఆస్తులు, 72 ఏళ్ల నుంచి కేసీఆర్ కుటుంబం ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఆస్తులపై సిట్టింగ్ జడ్జీతో(Sitting judge) విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.