పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగుతాం
ఎమ్మెల్యే కోవా లక్ష్మి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా, పోరాటాల గడ్డ అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi) అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం(National Unity Day) సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి 1969 తెలంగాణ ఉద్యమం, కేసీఆర్(KCR) నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అనేక పోరాటాలు జరిగాయని అన్నారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించిన అమరవీరులకు బీఆర్ఎస్(BRS) తరఫున శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఆనాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎదుర్కొంటామని అన్నారు. తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు సరస్వతి, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ హైమద్, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, సలాం, రాజంపేట సర్పంచ్ పోషన్న, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.