కేసీఆర్‌కు కాదు.. ముందే కాంగ్రెస్‌కే
హైదరాబాద్: నిన్న తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ముందు జరిగిన ఘర్షణలో బీఆర్ఎస్ మహిళా సభ్యులపై హేయంగా దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను, ఆయన కులాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ నీచ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్(MLC Tata Madhu Speaker)ను ఏమీ అనలేదని, అయినా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో బహిరంగంగా క్షమాపణలు చెప్పారని కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని, ఎస్కార్ట్ పెట్టి మరీ కాంగ్రెస్ గూండాలను కేసీఆర్ ఇంటిపైకి పంపారని దుయ్యబట్టారు. ఓ కాంగ్రెస్ సభ్యుడు మా నాయకుడు కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నారని, తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ చనిపోవాలా..? రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కేసీఆర్ చనిపోవాలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ కు కాదు, అందరికంటే ముందే కాంగ్రెస్ కే చావు వస్తుందని, ప్రభుత్వం దగ్గర మా ప్రశ్నలకు సమాధానం లేదు.