షిర్డీలో బెల్లంపల్లి చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మహారాష్ట్రలోని షిర్డీలో స్నేహ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. బెల్లంపల్లికి చెందిన నాట్య గురువు అర్చన జయప్రకాశ్ శిక్షణలో చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయినాథుని సన్నిధిలో చిన్నారులు సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కార్యక్రమం అనంతరం చిన్నారులకు మెమంటోలను, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువు అర్చన జయప్రకాశ్, బెల్లంపల్లికి చెందిన భాయిజమ్మ సేవా ట్రస్ట్ నిర్వాహకులు కంపెల్లి శంకర్, రాజేశ్వరీ, చిన్నారుల తల్లిదండ్రులు, కళాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.షిర్డీ వంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని నాట్య గురువు అర్చన జయప్రకాశ్ తెలిపారు. చిన్నారుల్లో భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఆసక్తిని పెంపొందించి, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.