ముత్తారం మండల వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా కుక్కల చంద్రమౌళి

09-09-2026 | 10:11pm

ముత్తారం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం(Telangana State Ward Members Forum) రాష్ట్ర అధ్యక్షురాలు నాగవల్లి జ్యోతి ఆదేశాల మేరకు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి తపట్ల మోహన్ ఆధ్వర్యంలో ముత్తారం మండల వార్డు సభ్యుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కుక్కల చంద్రమౌళి, కార్యదర్శిగా దొడ్ల కమలాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్యాల లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కుక్కల చంద్రమౌళి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న వార్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలోని ప్రతి వార్డు సభ్యుడికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు సభ్యుల హక్కులు, విధులు, అధికారాల పరిరక్షణకు కృషి చేస్తూ ఫోరంను మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మండలంలోని వార్డు సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు