6 September, 2026 | 10:11 PM

ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో కుర్తివాడ విద్యార్థుల ప్రతిభ

06-09-2026 | 08:24pm

పాపన్నపేట,సెప్టెంబర్06: గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో టైకా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌(All India Karate Championship)లో కుర్తివాడ గ్రామానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో ముక్కుట్ల శ్రీనిక గోల్డ్ మెడల్, వేదశ్రీ సిల్వర్ మెడల్, గగన్ సిల్వర్ మెడల్, లతిక బ్రాంజ్ మెడల్ సాధించారు.

ఈ ఛాంపియన్‌షిప్‌కు ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలను నాగేష్ మాస్టర్ ప్రధాన ఆర్గనైజర్‌గా పర్యవేక్షించగా, మణి మాస్టర్‌తో పాటు పలువురు కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి కుర్తివాడ గ్రామానికి, తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని నాగేష్ మాస్టర్ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు