శౌచాలయాలకు తాళాలు.. రైల్వే ప్రయాణికుల అవస్థలు

08-09-2026 | 04:55am

యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లో(Nagireddypalli Railway Station) మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్లో ప్రతిరోజూ పల్నాడు ఎక్స్ప్రెస్, కాచిగూడ రైళ్లు నిలుస్తుండటంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం మహిళలు, పురుషులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా శౌచాలయాలు నిర్మించినప్పటికీ, అధికారులు వాటిని ఎల్లప్పుడూ తాళాలు వేసే ఉంచుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శౌచాలయాలను దుర్వినియోగం కాకుండా చూడటానికే తాళాలు వేస్తున్నామని, కావాల్సిన వారు తమ వద్ద నుంచి తాళం చెవి తీసుకుని వాడుకోవచ్చని సూచిస్తూ స్టేషన్ నిర్వాహకులు ఒక బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే అక్కడ రైలు ఆగే ఒకటి రెండు నిమిషాల సమయంలో అధికారుల వద్దకు వెళ్లి తాళాలు తీసుకుని వాటిని వినియోగించుకోవడం అసాధ్యం అని పలువురు ప్రయాణికులు తమ మనసులోని మాటను వెలిబుచ్చడం గమనార్హం.



మరిన్ని వార్తలు