ముద్ద చర్మ వ్యాధి నివారణకు పశువులకు టీకాలు

06-10-2026 | 11:59am

కంగ్టి,(విజయక్రాంతి): పశువులకు సోకే ముద్ద చర్మ వ్యాధి (Lumpy Skin Disease)ను నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.ఈ సందర్భంగా పశువైద్య అధికారి ముస్తక్ అలీ స్వయంగా పశువులకు టీకాలు వేశారు. అనంతరం పశువైద్య సిబ్బంది గ్రామంలోని ఇతర పశువులకు కూడా టీకాలు అందించారు. పశువుల యజమానులు తమ పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యులను సంప్రదించాలని ముస్తక్ అలీ సూచించారు. పశువుల ఆరోగ్యం(Livestock Health)పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర రాజేందర్ రావు, స్థానిక సర్పంచ్ శివాజీ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు