చిన్నారులను గాల్లోకి ఎగరేస్తూ పైశాచిక చేష్టలు

06-10-2026 | 12:30pm

బిహార్‌ రాష్ట్రంలోని సీతామర్హి (Sitamarhi) జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పసిపిల్లలతో ప్రమాదకరంగా ప్రవర్తించిన వీడియో (Video) సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. పూజారి వేషధారణలో ఉన్న అతడు తన వద్దకు వచ్చిన చిన్నారులను గాల్లోకి ఎగురవేస్తూ వికృత చేష్టలకు పాల్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను చూస్తూ నవ్వుతూ (Laughing) ఉండటం కూడా కనిపించింది.

మరో దృశ్యంలో సుమారు ఐదేళ్ల చిన్నారి గొంతు పట్టుకుని పైకి లేపినట్లు కనిపించడం కలకలం రేపుతోంది. చిన్నారులతో ఇలాంటి ప్రమాదకర చర్యలకు (Dangerous Acts) పాల్పడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘ఇదేం వెర్రితనం?’’ అంటూ కామెంట్లు (Comments) చేస్తున్నారు


మరిన్ని వార్తలు