ట్రెంట్ షేర్లకు డిమాండ్
ముంబై: రిటైల్ రంగంలోని ట్రెంట్ లిమిటెడ్ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. కంపెనీ రెండో త్రైమాసిక ఆదాయం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెంది రూ.5,788 కోట్లకు చేరిన నేపథ్యంలో షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి పెరిగింది. దీంతో ట్రెంట్ షేర్ ధర 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కంపెనీ ఆదాయ వృద్ధి మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
ట్రెంట్ షేర్‌పై ఇన్వెస్టర్లు ఇప్పుడు కొనుగోలు చేయాలా, హోల్డ్ చేయాలా లేదా లాభాలు నమోదు చేసుకోవాలా అనే అంశంపై దృష్టి సారిస్తున్నారు. అయితే షేర్ ధరలపై నిర్ణయం తీసుకునే ముందు కంపెనీ ఆర్థిక ఫలితాలు, వాల్యుయేషన్, మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ వృద్ధి అవకాశాలను పరిశీలించడం కీలకం.