సత్యం అహింస మార్గాలు ప్రజలకు ఆదర్శం..
02-10-2026 | 06:42pm
పట్టణ ఎస్సై నాగరాజు
పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Mahatma Gandhi Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ. టి నాగరాజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు దేశ ప్రజలకు ఆదర్శం అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలు, విసిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గనీ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.