సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలం: బిఆర్ఎస్
మల్కాజిగిరి,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్(BRS State Working President), మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామా రావు, మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) ఆదేశాల మేరకు సోమవారం బిఆర్ఎస్ నాయకులు మల్కాజిగిరి సర్కిల్ కార్యాల యం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా మల్కాజిగిరి "ప్రజావాణి" కార్యక్రమం లో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంత రం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన 420 హామీలు అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న తాగు నీరు, వీధిదీపాలు, బస్తీ దవాఖాన ఏర్పాటు, వృద్ధులకు పింఛన్లు, తదితర సమ స్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, మేకల సునీత రాముయాదవ్, బిఆర్ఎస్ నాయకులు జేఏ సీ వెంకన్న, రాము యాదవ్, చిన్నయాదవ్, టిఆర్ఎస్వి నర్సింగ్, ప్రభాకర్ గౌడ్, కేబుల్ రమేష్, సతీష్, సుధాకర్,కోటేష్, శ్రీకాంత్, నవీన్, ఇబ్రహీం,కిట్టు, ఉపేందర్, అనిత, లక్ష్మి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
