పిట్టకేసేందుకు వెళ్ళి..
05-10-2026 | 03:27pm
చెరువులో పడి మనవడి దుర్మరణం
ఇనుగుర్తి (విజయక్రాంతి): నాయనమ్మ చనిపోయిన మూడవరోజు ఖర్మలో భాగంగా పిట్టకేసేందుకు వెళ్లి చెరువులో పడి మనుమడు దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం(Inugurthi Mandal) చిన్న ముప్పారంలో సోమవారం జరిగింది. మృతుడు కాలేరు రవి (55) సమీప బందువు కాలేరు ఉప్పలమ్మ మూడు రోజుల క్రితం మరణించింది. సోమవారం ఉప్పలమ్మ మూడవరోజు ఖర్మలో భాగంగా చెరువు వద్ద పిట్టకు పెట్టడానికి వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి రవి మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనుగుర్తి ఎస్ఐ నరేష్ తెలిపారు.