మంథని మార్కెట్ రోడ్డుపై వ్యక్తికి తీవ్ర గాయాలు
తలకు బలమైన గాయం.. మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనికి తరలింపు
మంథని, అక్టోబర్ 01(విజయ క్రాంతి) పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ (Vegetable market)రోడ్డుపై నడుస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య సంతోష్ (35) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బండపై కాలు వేయడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైంది.
స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు నిమ్మతి శ్రీనివాస్, పైలెట్ హబీబ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంతోష్‌కు ప్రాథమిక చికిత్స అందించి మంథని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని ఆసుపత్రి వైద్యులు అభినందించారు.