లారీ, బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

01-10-2026 | 03:00pm

గండీడ్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని అంచన్‌పల్లి గ్రామానికి(Anchanpally village) చెందిన యాదయ్య (42), తండ్రి భీమయ్య, లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో యాదయ్య తలకు, కుడి కాలికి బలమైన గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ శ్రీశైలం, పైలట్ అక్బర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదయ్య వద్ద ఉన్న రూ.1,000 నగదు, సెల్‌ఫోన్‌ను ఆసుపత్రి వైద్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు