7 September, 2026 | 6:09 AM

గొప్ప సినిమాటిక్ అనుభవాన్నిచ్చే మండాడి

07-09-2026 | 05:05am

తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘మండాడి(Mandaadi)’. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సెప్టెంబర్ 10న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. “అందరి ప్రోత్సాహంతో ఎన్నో దశలు దాటుకుంటూ ‘మందాడి’ వరకు వచ్చా. సెప్టెంబర్ 10న ఓ వినూత్న కంటెంట్ థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉండండి” అన్నారు. హీరో సూరి మాట్లాడుతూ.. “ఈ సారికి వదిలేయండి, వచ్చే సారి ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతా. ‘మండాడి’ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సుహాస్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది” అని తెలిపారు.

“మందాడి’ నాకు చాలా స్పెషల్. ఈ సినిమా చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా” అని తెలిపింది హీరోయిన్ మహిమా నంబియార్. డైరెక్టర్ మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ.. “బోట్ రేస్ అనేది తమిళనాడులో ట్రెండ్. మా సినిమా ప్రతి ప్రేక్షకుడికీ గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పంచుతుందని నమ్ముతున్నా” అని చెప్పారు. నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం చాలా డబ్బు వెచ్చించాం. నటీనటులంతా బాగా కష్టపడి ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారు” అని తెలిపారు. ఇంకా ఈ ఈవెంట్‌లో అతిథులు మైత్రి నవీన్, డైరెక్టర్లు శైలేష్ కొలను, శివ నిర్వాణ, చిత్ర నటీనటులు రవీంద్ర విజయ్, గీత రచయిత భాస్కర్ భట్ల కూడా మాట్లాడారు. 


మరిన్ని వార్తలు