ఎల్నినో పరిస్థితులపై మండల స్థాయి సమావేశం
11-09-2026 | 08:11pm
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల ప్రజా పరిషత్ కార్యాలయం(Chivvenla Mandal Praja Parishad Office)లో మండల ప్రత్యేక అధికారిణి శ్రీమతి సులోచనారాణి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రస్తుత ఎల్నినో పరిస్థితులతో( El Nino conditions) పాటు తమ శాఖల ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచులు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానాలు ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని మండల ప్రత్యేక అధికారిణి సులోచనారాణి సూచించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.