తప్పిన ట్రాఫిక్ తిప్పలు
వర్షంలోనూ రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన మంథని సీఐ
సీఐని అభినందించిన ప్రయాణికులు, స్థానిక ప్రజలు
రామగిరి, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై(Peddapalli–Manthani Main Road) రామగిరి మండలం నాగేపల్లి బస్టాండ్ సమీపంలో భారీ వర్షానికి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మంథని సీఐ బుద్ధె స్వామి వెంటనే స్పందించి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరిస్తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం వెంటనే జేసీబీని తెప్పించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించేలా చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపట్లోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. వర్షంలోనూ స్వయంగా రోడ్డుపైకి దిగి పరిస్థితిని చక్కదిద్దిన సీఐ బుద్ధె స్వామి తీరును ప్రయాణికులు, స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజల ఇబ్బందులపై వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్న సీఐ స్వామి పనితీరు ప్రశంసలు అందుకుంది.