జిల్లాలకు హెచ్చరిక
హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో వర్షాల(heavy rains) ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు(Flash flood warnings) జారీ అయ్యాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో భారత వాతావరణ అధికారులు(India Meteorological Department) అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్లు అకస్మాత్తుగా సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.
ఏపీలో పలు జిల్లాలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు(Flash flood threat) ఉన్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే వాగులు, కాలువలు, చెరువుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరం లేకుండా వరద నీటిలోకి వెళ్లకూడదని, నీటి(AP Rains) ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలను నివారించాలని అధికారులు చెబుతున్నారు. వర్షాల సమయంలో వరద నీటితో ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, బ్రిడ్జిల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు నీటితో నిండిన రహదారులను దాటేందుకు ప్రయత్నించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి స్థానిక యంత్రాంగం నుంచి వచ్చే సూచనలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు.