సమిష్టి కృషితోనే తెలంగాణ అభివృద్ధి
17-09-2026 | 02:39pm
ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ్రావు
చేగుంట,(విజయక్రాంతి): సమిష్టి కృషితోనే తెలంగాణ అభివృద్ధి(Telangana Development) సాధించవచ్చు అని చేగుంట మార్కెట్ కమిటీ(Chegunta Market Committee) చైర్మన్ తాడేం వెంగళ్ రావు అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడాతూ... 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు.