ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు
22-08-2026 12:57 AM
విజయక్రాంతి నెట్ వర్క్, ఉమ్మడి నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో గల దేవాలయాలకు తెల్లవారుఝామున వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అర్చకులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. తదుపరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.






