పత్తి పంటలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి...

24-09-2026 | 06:15pm

మాల్ తుమ్మెద శాస్త్రవేత్త రేవంత్ 

తాడ్వాయి,సెప్టెంబర్ 24( విజయ క్రాంతి ): పత్తి పంటలో వచ్చిన పచ్చ దోమ,తెల్ల దోమ, సూక్ష్మ ధాతు లోపాలు ఉన్నాయని వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని మాల్ తుమ్మెద తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన కేంద్రం(Telangana State Science Centre) శాస్త్రవేత్త రేవంత్ తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్,దేమి కలాన్, చిట్యాల గ్రామాలలో గురువారం ఆయన పత్తి,వరి,కంది పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పత్తి పంటలో వచ్చిన దోమల నివారణకు సిప్రోనిల్ లేదా అసెత మిప్రిడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలని సూచించారు.

వరి పంటలో మోగి పురుగు ఉందని దాని నివారణకు కర్తప్ హైడ్రోక్లోడ్ 50% ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలని సూచించారు. రైతులు ఎప్పటికప్పుడు పంటలో వస్తున్న చీడ పీడలను గమనించాలని కోరారు.ఎల్లారెడ్డి ఏడిఏ సుధా మాధురి మాట్లాడుతూ... రైతులు కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వ ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సింలు,ఏఈవో శివ చైతన్య, సర్పంచులు భీరవ్వ,బైరవి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు