ఉచిత గుండె వైద్య శిబిరం
‘మెడికవర్’లో ఏర్పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వరల్డ్ హార్ట్ డే(World Heart Day) సందర్భంగా ప్రజల్లో గుండె ఆరోగ్యంపై(Heart health) అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్(Secunderabad Medicover Hospitals) ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం(Free heart medical camp) నిర్వహించారు. శిబిరంలో బీపీ, ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు కార్డియాలజీ నిపుణులు(Cardiology specialists) వైద్య సలహాలు అందించారు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఛాతి నొప్పి, శ్వాసలో ఇబ్బందులు తదితర సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా హాజరై శిబిరాన్ని సందర్శించారు.
డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి, చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వానస్డ్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్ మాట్లాడుతూ.. గుండె జబ్బులు వృద్ధులకే కాకుండా యువతలోనూ పెరుగుతున్నాయని తెలిపారు. అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో డా. ఎన్. శివ ప్రసాద్ నాయుడు (సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్), డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్ (సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్), డా. వినోద్ వాద్య (సీనియర్ కార్డియాలజిస్ట్), డా. కె. సాకేత్ (సీనియర్ కార్డియాలజిస్ట్), డా. ప్రదీప్ కుమార్ మిశ్రా (జనరల్ మెడిసిన్), డా. శ్రీనివాస్ రావు దూసా (న్యూరాలజిస్ట్), సెంటర్ హెడ్ శ్రీమతి కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.