జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
16-09-2026 | 09:40pm
19వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి
కోదాడ,(విజయ క్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో జరిగే మెగా జాబ్‌మేళా(Mega Job Fair) సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, 19వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి(Councilor Kolla Kotireddy) కోరారు. బుధవారం ఆయన కోదాడలో మాట్లాడుతూ... మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy), ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో నిర్వహించే ఈ మేళాకు సుమారు 200–250 కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐతో పాటు అర్హత ఉన్న నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.