వినాయక దేవ ప్రజలందరిని చల్లగా చూడు

22-09-2026 | 06:42pm

కూసుమంచి మండలంలోని గణేశ్ వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

కూసుమంచి, (విజయక్రాంతి): విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ కూసుమంచి మండల లోని నాయకన్ గూడెం, గురువాయిగూడెం, కూసుమంచి గ్రామాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) వివిధ గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, భక్తులు మంత్రిగారికి ఘన స్వాగతం పలికారు...రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందాలు నిండాలని మంత్రి  వినాయకుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ హఫీజుద్దీన్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు మంకెన వాసు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి కుమార్, మాజీ ఎంపీపీ లు రామ సహాయం వెంకట రెడ్డి,జూకూరి గోపాలరావు, బానోత్ శ్రీను నాయక్, మాజీ జడ్పీటీసీ  రామ సహాయం బాలకృష్ణారెడ్డి , మాజీ ఎంపిటిసి మాదాసు ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లం పల్లి సుధాకర్ రెడ్డి,  కంచర్ల జీవన్ రెడ్డి, నాగిరెడ్డి రమేష్ రెడ్డి, కూసుమంచి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బోడా వీరు నాయక్ మరియు ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు