ఇళ్ల స్థలాలకు సీతక్క హామీ

29-09-2026 | 09:14am

ములుగు, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): జర్నలిస్టులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరి(journalists)కీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ములుగు నూతన కలెక్టరేట్ లో  సోమవారం మంత్రి సీతక్క(Minister Seethakka)ను ప్రింట్ మీడియా మిత్రులు కలిసి తమ సమస్యలను వివరించి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి తొందరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జర్నలిస్టుల విజ్ఞప్తి పై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించడంతో ఇళ్ల స్థలాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో ఆశాభావం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు బొమ్మన బోయిన పృథ్వీరాజ్, రామిడి కృష్ణారెడ్డి, గండ్రకోట విష్ణు, కొమురయ్య, జాలిగం శ్రీనివాస్, బిక్కనూరి సుమన్, రాజవర్ధన్, శంకర్, గంగాధర్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు