ఎల్ నినో కరువు.. ప్రత్యేక సాయం చేయాలి

30-09-2026 | 05:30am
  1. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
  2. అనేక మండలాల్లో లోటు, తీవ్ర లోటు వర్షపాతం
  3. జొన్న, మక్కను ధరల మద్దతు పథకం పరిధిలోకి తేవాలి
  4. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలి
  5. పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రెండో స్థానం
  6. జాతీయ రబీ సదస్సులో ప్రసంగం

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): ఎల్ నినో కరువు పరిస్థితుల(El Nino drought conditions) నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు మొక్కజొన్న(Corn), జొన్నను ధరల మద్దతు పథకం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) కోరారు. రాష్ట్రంలోని అనేక మండలాలు లోటు, తీవ్ర లోటు వర్షపాత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తె లిపారు. రాష్ట్ర సగటు వర్షపాతం ఆధారంగా కాకుండా మండలాల స్థాయిలో నెలకొన్న వా స్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. లోటు, తీవ్ర లోటు వర్షపాత మండలాలకు కేంద్రం నుంచి ప్రత్యేక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో మంత్రి తుమ్మల ప్ర సంగించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సా ధిస్తున్న ప్రగతితో పాటు రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివ రించారు. పంటల వైవిధ్యీకరణ, వాతావరణ మార్పులను(Climate change) ఎదుర్కొనే వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయం, వ్యవసాయ మౌలిక వసతులు, రైతులకు రుణ సదుపాయాలపై తెలం గాణలో అమలుచేస్తున్న చర్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

 పప్పుధాన్యాల సాగులో 36శాతం వృద్ధి

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో గత ఏడాది ఖరీఫ్ కంటే 36 శాతం  అధికంగా సాగైందని, దీంతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఎ ల్ నినో ప్రభావం, వర్షపాతంలో మార్పు లు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపా రు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు త గ్గట్టు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మ ళ్లేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందు లో భాగంగానే పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో 36% వృద్ధితో తెలంగాణ ముం దువరసలో నిలిచిందని ఆయన వివరించారు.  

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి

సూక్ష్మ సాగునీరు, రక్షిత సాగునీరు, నీటి సంరక్షణ నిర్మాణాలకు ప్రత్యేక సహకారం అం దించాలన్నారు. ఆయిల్‌ఫామ్ సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును తెలంగాణ రైతులు అందుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ఫామ్ సాగు విస్తరించిందని, సుమారు 72 వేల మం ది కొత్త రైతులు ఆయిల్‌ఫామ్ సాగులోకి తె చ్చారని ఆయన వివరించారు.

ఆయిల్‌ఫామ్  దీర్ఘకాలిక పంట కావడంతో రైతులకు స్థిరమై న, గిట్టుబాటు ధరలు ఎంతో ముఖ్యమని, వాళ్లలో నమ్మకాన్ని కొనసాగించేందుకు కేం ద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ యిల్‌ఫామ్  రైతుల ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకుని క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని కేంద్రానికి మంత్రి తుమ్మ ల విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, అదనంగా 16 కేంద్రాలను మంజూరు చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు