3 September, 2026 | 9:40 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

03-09-2026 | 09:07pm

బెల్లంపల్లి అభివృద్ధిపై చర్చ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) సీఎం రేవంత్ రెడ్డి నీ కలిశారు. మర్యాద పూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి నా ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం చర్చించారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని బెల్లంపల్లి ఎమ్మెల్యే కలిశారు.  ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గం(Bellampalli Constituency)లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన బడ్జెట్ ను కేటాయించాలని సీఎంను కోరారు.

నియోజకవర్గంలో మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్య, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై  ముఖ్యమంత్రి కి నివేదించారు. బెల్లంపల్లి నియోజకవర్గ(Bellampally Constituency) సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి, నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. ఇప్పటికే ప్రతిపాదించిన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డినీ కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి అభివృద్ధి కోసం ఇచ్చిన హామీ మాత్రం లేకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.