గండుగులపల్లిలో ప్రత్యేక గ్రామసభ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వి.బి.జి. రామ్జీ ప్రత్యేక గ్రామసభతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinayana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ జారే మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులు, ప్రజలతో చర్చించారు. అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
అనంతరం గండుగులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(Mandal Parishad Primary School)ను ఎమ్మెల్యే సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటశాల, డైనింగ్ హాల్ నిర్మాణ పనులు పూర్తికావడంతో వాటిని ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ బి రవీంద్ర రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.