7 September, 2026 | 7:19 AM

ఈ గడ్డ మీదే నా ప్రాణం విడుస్తా..!

07-09-2026 | 04:35am

ఎవరికీ తల వంచను 

అభివృద్ధి, సంక్షేమంలో నాకు సాటి లేరు 

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పీఎస్‌ఆర్

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 6: ఈ గడ్డ మీదే పుట్టిన, ఇక్కడే ప్రజా సేవలో నా ప్రాణం వి డుస్తా కానీ ఎవరి ముందు తలవంచను అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్ పీ ఆర్ గార్డెన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పటి వర కు అత్యధిక కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఘ నత తనకే దక్కిందన్నారు. కళ్యాణ లక్ష్మీ 3,0 85, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ సు మారు 3,533 చెక్కులతో పాటు దాదాపుగా పేదల చికిత్స కోసం 700 ఎల్‌ఓసీలను కూ డా అందజేసినట్లు తెలిపారు. అంతేకాకుం డా లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని నేడు మోడల్ హాస్పిటల్ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు.

ఆదిలాబాద్ రిమ్స్ నుంచి కూ డా ఇక్కడికి రోగులు వస్తున్నారంటే వైద్య సే వల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల కోసం ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరాని కి ధీటుగా నిలబెడుతామని వివరించారు. అ దే విధంగా రైతుల పంటలకు నష్టం జరుగకుండా సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం 312 మంది లబ్దిదారులకు సు మారు రూ. 90 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చె క్కులు నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజ లి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు పూర్ణ చందర్ రావు, ఆరీఫ్, పింగళి రమేష్, నలిమేల రాజు, షాహిద్ అలీ, గడ్డం త్రిమూర్తి, తూముల నరేష్, కౌన్సిలర్లు, సర్పంచ్ లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు